మరో నియామకం చేపట్టిన జగన్
కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా దామా సుమంత్ ను వైఎస్ జగన్ నియమించారు.
కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా దామా సుమంత్ ను వైఎస్ జగన్ నియమించారు. గాజువాకకి చెందిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైసీపీ సిఈసి మెంబర్, 86వ వార్డు వైసీపీ ఇంచార్జ్ దామా సుబ్బారావు కుమారుడు దామా సుమంత్ కి ఏపీ ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించింది.
కమ్మ కార్పొరేషన్....
ఈ సందర్బంగా ఉత్తరాంధ్ర ఇంచార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ని మర్యాద పూర్వకంగా దామా సుబ్బారావు, దామా సుమంత్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి పదవి ఇచ్చినందుకు వారు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.