Andhra Pradesh : విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు

Update: 2025-12-16 03:13 GMT

పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. నవంబరులో నిర్వహించిన క్యాంపులు కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, 22 నుంచి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అప్ డేట్ చేసుకోవాల్సిన వారు...

ఈ క్యాంప్ లలో ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు బయోమెట్రిక్ అప్ డేట్ మిగిలి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,51,271 మంది విద్యార్థులుండగా, గత క్యాంపులో 3,34,599 మంది విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోగా, నమోదు చేసుకోవాల్సిన వారు 13,16,672 మంది ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.


Tags:    

Similar News