Andhra Pradesh : ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం రికార్డు
ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ప్రభుత్వం తెలిపింది.
ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ప్రభుత్వం తెలిపింది. ఒకే రోజులో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 3.24 లక్షల మంది రైతుల నుంచి 20.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి వారి ఖాతాల్లో రూ.4,609 కోట్లనుకూటమి ప్రభుత్వం జమ చేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రైతుల ఆందోళన నేపథ్యంలో....
గత కొద్ది రోజులుగా ధాన్యం సేకరణపై రైతుల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు ధాన్యం కొనుగోలును ముమ్మరం చేసినట్లు తెలిపారు. తేమ శాతం చూడకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు ప్రకటించారు.