Ys Jagan : నేడు విజయవాడలో జగన్ పర్యటన

Ys Jagan : నేడు విజయవాడలో జగన్ పర్యటన

Update: 2025-12-16 02:09 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. భవానీపురంలోని జోజినగర్ కు వెళ్లనున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో నలభై రెండు ప్లాట్లను కూల్చివేసిన నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు జగన్ అక్కడకు వెళుతున్నారు. ఇటీవల రెండుసార్లు జోజినగర్ బాధితులు జగన్ ను కలసి తమ గోడును వినిపించుకోగా, తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు.

జోజినగర్ పర్యటనకు...
ఇందులో భాగంగా అక్కడ కూల్చివేతలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జగన్ అక్కడకు బయలుదేరి వెళుతున్నారకు. ఉదయం పది గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి జగన్ నేరుగా భవానీ పుర బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇళ్లను కోల్పోయిన బాధితులను జగన్ పరామర్శించనున్నారు.


Tags:    

Similar News