నేడు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగింపు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేడు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగియనుంది
indrakiladri vijayawada temple
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేడు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగియనుంది. నిన్న ఒక్కరోజు దుర్గమ్మను 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమయింది. దీక్షల విరమణ సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మహా పూర్ణాహుతి కార్యక్రమంతో...
ఈ ఐదు రోజుల పాటు దుర్గమ్మ గుడిలో అంతరాలయ దర్శనాన్ని కూడా రద్దు చేశారు. ఈరోజు యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమంతో భవానీదీక్షల విరమణ ముగియనుంది. దీంతో ఈరోజు తెల్లవారు జాము నుంచి ఇంద్రకీలాద్రికి భారీగా దుర్గమ్మ భక్తులు చేరుకుంటున్నారు. పోలీసులు, ఆలయ సిబ్బంది సంయుక్తంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.