తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండ కూడదని అభిప్రాయపడింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యత ఉండదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పరకామణి లో దొంతగనం పెద్ద నేరమని హైకోర్టు అభిప్రాయపడింది. చోరీ కేసు అయినా అది నేరంగానే చూడాలని చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఐ వాడకాన్ని చేపట్టాలని కోరింది.
లెక్కింపులో సాంకేతిక పరిజ్ఞానాన్ని...
పరకామణి లో లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. విరాళాల కౌంటిగ్ ఒక టేబుల్ ను ఏర్పాటు చేయడమే కాకుండా టెక్నాలజీని కూడా వినియోగించాలని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. కౌంటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పరకామణిలో లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగాచేపట్టేందుకు విజిల్ టెక్నాలజీని వినియోగించి ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని టీటీడీకి ఏపీ హైకోర్టు సూచించింది.