నేటి నుంచి చెన్నై టూ నర్సాపూర్ వందేభారత్ రైలు
ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది
ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నేటి నుంచి నర్సాపూర్ వరకూ వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. ఇప్పటి వరకూ తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకే ఉన్న వందేభారత్ రైలును నర్సాపూర్ వరకూ విస్తరించారు ఈ వందేభారత్ రైలు భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్ కు చేరుకుంటుంది. నర్సాపూర్ నుంచి చెన్నైకు కేవలం తొమ్మిది గంటల్లోనే ప్రయాణించవచ్చు.
టిక్కెట్ ధరలు ఇలా...
ఈరోజు చెన్నై - నర్సాపూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనుండగా ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ వందేభారత్ రైలు రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ, గుడివాడ మీదుగా భీమవరం చేరుకుంటుంది. అలాగే మధ్యాహ్నం 2.50 గంటలకు నర్సాపూర్ లో బయలుదేరి రాత్రి 11.45 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది. టిక్కెట్ ధర 1,635 రూపాయలుగా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ ఛెయిర్ కార్ కు 3,030 రూపాయలుగా నిర్ణయించారు.