మరోసారి వంగవీటి సంచలన కామెంట్స్
వంగవీటి రాధా మరోసారి సంచలనమైన కామెంట్స్ చేశారు. రంగా అభిమానులు తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నారు.
వంగవీటి రాధా మరోసారి సంచలనమైన కామెంట్స్ చేశారు. రంగా అభిమానులు తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నారు. అలాగే నిలబెడతారు కూడా అని రాధా వ్యాఖ్యానించారు. విజయవాడలో రంగా విగ్రహావిష్కరణ సభలో రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. రంగా అభిమానులతో ఎవరూ పెట్టుకోవద్దని కూడా హెచ్చరించారు. రంగా పేరు చెప్పుకుని ఎంతోమంది రాజకీయ పదవులను అనుభవించారని చెప్పారు.
జిల్లాకు రంగా పేరు....
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని రాధా డిమాండ్ చేశారు. రంగా పేరును జిల్లాకు ఎవరు పెట్టినా వారిని అభినందిస్తామని చెప్పారు. తనకు జీవితాంతం అండగా ఉండేది రంగా అభిమానులేనని చెప్పారు. రంగాకు ప్రాంతం, మతం, కులం అనేది తెలియవని, ఆయన అందరి మనిషి అని చెప్పారు. రంగా తనయుడిగా తనకు కూడా రాజీ పడటం అనేది తెలియదని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటానని చెప్పారు.