టిటిడి కీలక నిర్ణయం.. 5 రోజులు బ్రేక్ దర్శనాలు నిలిపివేత

రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేయాల్సి ఉంది. కానీ.. మూడ్రోజులుగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయకపోవడంతో..

Update: 2022-04-12 06:06 GMT

తిరుపతి : తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేయాల్సి ఉంది. కానీ.. మూడ్రోజులుగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయకపోవడంతో.. భక్తులు మూడు సెంటర్ల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనార్థం భక్తుల తాకిడి పెరగడంతో.. క్యూలైన్లలో తోపులాట జరిగింది. పలువురికి గాయాలు కాగా.. చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఈ నేపథ్యంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులను టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఐదురోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రేక్ దర్శనాల సమయంలోనూ సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు టిటిడి ప్రకటించింది. భక్తులు అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి టిటిడి సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేసింది.


Tags:    

Similar News