Andhra Pradesh : కల్యాణదుర్గంలో మరో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ

రాయలసీమకు గుడ్ న్యూస్. కియాతో పాటు మరొక భారీ సంస్థ రాయలసీమకు రానుంది.

Update: 2026-01-21 04:22 GMT

రాయలసీమకు గుడ్ న్యూస్. కియాతో పాటు మరొక భారీ సంస్థ రాయలసీమకు రానుంది. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. కల్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో రూ.1,300 కోట్లతో ఎల క్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సర్ణా ఏవియేషన్ ముందుకొచ్చింది. ఆ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఈ విమానాల తయారీ కర్మాగారానికి స్కై ఫ్యాక్టరీగా నామకరణం చేశారు.

మొదటి విడతగా ...
150 ఎకరాల్లో రూ.330 కోట్ల పెట్టుబడితో మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. 2029 నాటికి పూర్తిస్థాయిలో పరిశ్రమను నెలకొల్పాలని ఆ సంస్థ లక్ష్యంగా నిర్ణ యించుకుంది. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఏడాదికి 1,000 ఎయిర్ క్రాఫ్ట్ లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా పట్టణ వాయురవాణాకు ఒక పూర్తిస్థాయి వ్యవస్థను నెలకొల్పాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ పరిశ్రమ క్యాంపస్లో అత్యాధునిక సాంకే తికతతో పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, ల్యాబ్లు, విమాన టెస్టింగ్ సౌకర్యాలు, 2 కిలోమీటర్ల పొడవైన రన్వేలు నిర్మించ నున్నారు.
పైలట్లకు శిక్షణ...
ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి సర్దా ఏవియేషన్ ఇప్పటికే బెంగుళూరులో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. ఈవీటీవోఎల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ ద్వారా వాణిజ్య ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఆరు సీట్లు ఉండే ఈ విమానాలు ఒక సారి చార్జింగ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల దూరం, గంటకు 250 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిద్వారా మెట్రో పాలిటన్ నగరాలు, విమానాశ్రయాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది. ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు కూడా ఈ సేవలను వినియోగించుకునే వీలుంటుంది.
Tags:    

Similar News