పాదయాత్రపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు
వైఎస్ జగన్ పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. అప్పటి నుంచి ఏడాదిన్నర కాలం జనంలోనే ఉంటానని చెప్పారు. ఇక ప్రతి వారం నియోజకవర్గాలతో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని, ఏలూరు నియోజకవర్గం కార్యకర్తలతో నేడు సమావేశం ప్రారంభమయిందన్న జగన్ ఇక ప్రతి వారం నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు. ఇప్పటికే రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన పూర్తయిందని, రెండేళ్లకే పెద్దయెత్తున ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని చెప్పారు.
వ్యవస్థలన్నీ నిర్వీర్యం...
ఎక్కడా పోలిసింగ్ వ్యవస్థ కనిపించడం జగన్ అన్నారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, అందుకే ప్రజల్లో అవినీతి పెరిగిందని తెలిపారు. సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవన్ లేదని, ఫీజు రీఎంబర్స్ మెంట్ ను కూడా ఇవ్వడం లేదని జగన్ ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి ఈసారి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని జగన్ అన్నారు. ప్రజలందరూ వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు. క్యాడర్ అంతా ప్రజల్లో ఉండాలని, వారికి అండగా నిలబడాలని పిలుపు నిచ్చారు.