ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నో వర్క్.. నో పే’ విధానం చట్టసభల్లో రావాలని అన్నారు. లక్నోలో జరుగుతన్న స్పీకర్ల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు సభ్యులు సభకు హాజరుకాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్న అయ్యన్న పాత్రుడు వారిపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన నిబంధనలు మార్చాలని కోరారు.
సభకు హాజరు కాకుంటే...
ఉద్యోగులు విధులకు రాకపోతే వేతనాలు నిలిపివేస్తారని, మరి ఎమ్మెల్యేల విషయంలో అలా ఎందుకు చేయరని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ‘నో వర్క్.. నో పే’ విధానానికి అనుగుణంగా చట్టం చేయాలని అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.