Pawan kalyan : నేడు పెడన నియోజకవర్గానికి పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఆయన పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నియోజకవర్గంలోని పెద చందాల గ్రామానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు. అయితే జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన పెడనకు వస్తున్నారు.
కార్యకర్త కుటుంబాన్ని...
గత ఏడాది రహదారి ప్రమాదంలో జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంత రాయలు మరణించారు. చందు కుటుంబ సభ్యులను నేడు పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వస్తున్నారు. చందు వీర వెంకట వసంత రాయలు పార్టీ కోసం పనిచేసిన కృషితో ఆయన కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు. దీంతో పెడన తో పాటు పెద చందాల గ్రామానికి అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశముండటంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.