Andhra Pradesh : ఏపీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు తమకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులు డీఫాల్ట్ బెయిల్ పై ఉండటంతో తాము రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు చెప్పింది.
నిబంధనల మేరకు...
నిబంధనలు మేరకు వెళ్లాలని, ట్రయల్ కోర్టు ద్వారానే రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్లాలని చెప్పింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ముగ్గురికీ సూచించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నాలుగు వారాల గడువు ఇచ్చింది. నిబంధనల మేరకు నడచుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో తిరిగి ట్రయల్ కోర్టును ఈ ముగ్గురు ఆశ్రయించాల్సిందే.