Tirumala : టీటీడీకి భారీ విరాళాన్ని అందించిన మంతెన
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. టీటీడీకి తొమ్మిది కోట్ల రూపాయల విరాళం అందింది. ప్రవాస భారతీయుడైన మంతెన రామలింగరాజు టీటీడీకి తొమ్మిది కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునికీకరణకు ఈ నిధులను వ్యయం చేయాలని మంతెన రామలింగరాజు కోరారు.
తొమ్మిది కోట్ల రూపాయలను...
తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట ఈ తొమ్మిది కోట్ల రూపాయల విరాళాన్ని మంతెన రామలింగరాజు టీటీడీకి అందించారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంతెన రామలింగరాజు గతంలోనూ తిరుమలకు 12 కోట్ల రూపాయల విరాళం అందించారు.