Andhra Pradesh : నేడు ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రశేపెట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమై 2026-27 బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం పదకొండు గంటలకు శాసనసభలోఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
సంక్షేమం.. అభివృద్ధి...
3.48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం శాసనసభలో అచ్చెన్నాయుడు, శాసనమండలిలో అనగాని సత్యప్రసాద్ లు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.ఈ బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి నిధులు అత్యధికంగా కేటాయించే అవకాశముంది.