అంబటి రాంబాబును కస్టడీకి పిటీషన్

మాజీ మంత్రి అంబటి రాంబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు

Update: 2026-02-14 07:18 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించారని 2023లో నమోదైన కేసులో దర్యాప్తునకు ఐదు రోజుల కస్టడీని పోలీసులు కోరారు. ఈ కేసులో పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయని, వాటిని విచారించడం కోసం అనుమతివ్వాలని కోరారు.

సోమవారానికి వాయిదా...
ఈ కేసులో ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఈ కేసులో పీటీ వారెంట్ జారీ చేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. కస్టడీకి పోలీసులు కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. ఎల్లుండి దీనిపై తీర్పు వెలువడే అవకాశముంది.


Tags:    

Similar News