Weather Report : సూర్యుడు సెగలు కక్కుతున్నాడుగా.. మే లో మూమాలుగా ఉండదేమో?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత మొదలయింది.

Update: 2026-02-13 03:58 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత మొదలయింది. శివరాత్రి నాటికి మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రానురాను ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే ఎండలు ముదరడంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉక్కపోత వాతావరణం మొదలయింది. దీంతో ఇటు బయటకు వెళ్లలేక, మరొకవైపు ఇళ్లలో కుదురుగా ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా రెండు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. చలి తీవ్రతతో మొన్నటి వరకూ గజగజలాడిన ప్రజలు అది పూర్తిగా తగ్గిపోవడంతో చెమటలతో తడిసి ముద్దవుతున్నారు.

గరిష్టంగా నమోదవుతూ...
ఆంధ్రప్రదేశ్ లో భానుడి సెగలు ప్రారంభమయ్యాయి. ఎంతగా అంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వేసవి కాలం మొదలయిందని, ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ వేడిగాలుల తీవ్రత మొదలయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో, కోస్తాంధ్రలోని పల్నాడు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏడు గంటల నుంచే...
తెలంగాణలోనూ చలి కనుమరుగైంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వేడి వాతావరణం ఎక్కువయింది. ఉక్కపోత మొదలు కావడంతోనే విద్యుత్తు వినియోగం పెరిగింది. తెలంగాణలో ఉదయం వేళ కొంత చలిగాలులు వీస్తున్నప్పటికీ ఐదు గంటల వరకూ మాత్రమే. తర్వాత ఏడు గంటల నుంచి భానుడు సెగలు కక్కుతున్నాడు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో అయితే 35 వరకూ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు పగటి వేళ బయకు రావద్దని సూచిస్తున్నారు.



Tags:    

Similar News