Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకూ గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకూ గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టిక్కెట్లు పెట్టి కోట్లు దండుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదయింది. 2023లో సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై ఈ కేసు నమోదయింది. లాటరీ టిక్కెట్లు పెట్టి ప్రజలను మోసం చేశారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
ఈ నెల26వ తేదీ వరకూ...
మూడేళ్ల క్రితం నమోదయిన కేసులో ఇప్పుడు సెక్షన్లుమార్చి నోటీసులు ఇవ్వకుండా రిమాండ్ లో ఉంచేందుకు అక్రమ కేసులు బనాయించారని అంబటి తరుపున న్యాయవాదులు వాదించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్నన్యాయమూర్తి నెల 26వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. దీంతో అంబటి రాంబాబును గుంటూరు నుంచి తిరిగి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు.