Tirumala Laddu: తిరుమలలో లడ్డూ ఎలా తయారవుతుందో తెలుసా?

ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం నడుస్తున్న సమయంలో తిరుమలలో లడ్డూ తయారీ ఎలా చేస్తారన్న దానిపై అనేకమందికి అనేక సందేహాలున్నాయి.

Update: 2026-02-08 03:59 GMT

ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం నడుస్తున్న సమయంలో తిరుమలలో లడ్డూ తయారీ ఎలా చేస్తారన్న దానిపై అనేకమందికి అనేక సందేహాలున్నాయి.శ్రీవారి ఆలయంలో లడ్డుల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో తయారీని ప్రారంభించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5100 లడ్డులు మాత్రమేతయారుచేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. శ్రీవారి లడ్డు తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డుల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.

తొలి రోజుల్లో కట్టెల పొయ్యి మీద...
తొలి రోజుల్లో లడ్డులను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు. 1984 లో గ్యాసుపొయ్యిలు అమర్చారు.ఆ తరువాత యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు. తయారీ కోసం వాడే సరుకులను తీసుకువెళ్ళేందుకూ, తయారైన లడ్డులను తీసుకువెళ్ళేందుకూ పోటులో మూడు కన్వేయరు బెల్టులను ఏర్పాటు చేసారు. తిరుమలలో లడ్డు తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ 2.8 లక్షల లడ్లు తయారీ జరుగుతున్నది. రోజుకు 8 లక్షల లడ్లు తయారుచేసే సామర్థ్యం పోటుకు ఉంది.తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు జియోగ్రాఫికల్ పేటెంట్ లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం.
గతంలో వడకు...
భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డుదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డుకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి నైవేద్యవేళలు ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసేరోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డుగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుందిన. ప్రస్తుతం లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది.
లడ్డులలో రకాలు....
ఆస్ధానం లడ్డు - ఆస్థానం లడ్డును ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మాత్రమే వీటిని అందజేస్తారు. కళ్యాణోత్సవ లడ్డు - కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకూ కల్యాణోత్సవం లడ్డును ప్రసాదంగా అందజేస్తారు.
ప్రోక్తం లడ్డు - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకుఅందజేస్తారు.


Tags:    

Similar News