జనవరి నెలలో తిరుమలలో హుండీ ఆదాయం ఎంతంటే?
జనవరి నెలలో తిరుమలలో హుండీ ఆదాయం భారీగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు
జనవరి నెలలో తిరుమలలో హుండీ ఆదాయం భారీగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గతం కంటే జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పాటు జరుగుతుండటంతో పాటు, సంక్రాంతి సెలవులు కావడంతో పెద్దయెత్తున భక్తులు జనవరి నెలలో తిరుమలకు తరలి వస్తారు.
గత ఏడాది జనవరిలో...
గత ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 105 కోట్లు మాత్రమే వచ్చిందని, ఈ ఏడాది జనవరి నెలలో స్వామి వారి హుండీ ఆదాయం 124 కోట్లరూపాయలకు చేరిందని అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఎక్కువగా ఆదాయం రావడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.