నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు

నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు.

Update: 2025-02-17 02:16 GMT

నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రరాభించనున్నారు. ఉదయం బయలుదేరి తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబుకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం ఎక్స్ పోను చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు.

ఎక్స్ పో ప్రారంభం తర్వాత...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ , గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ ఎక్స్ పో ను ప్రారంభించిన తర్వాత ముగ్గురు ప్రసంగించే అవకాశాలున్నాయి.దేవాలయాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ ఎక్స్ పోను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లపై కూడా ఎక్స్ పోలు ప్రదర్శించే అవకాశముంది.


Tags:    

Similar News