చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు
విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమకు చెందిన ఎనిమిది సెంట్ల భూమిని ఆక్రమించారంటూ ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆందోళనకు దిగారు. శ్రీనివాసరావుకు జనసేన పార్టీ నేతలు మద్దతు తెలిపారు.
స్థలం ఆక్రమణ విషయంలో....
జనసేన పార్టీకి చెందిన శ్రీనివాసరావు స్థలం ఆక్రమణకు గురయిందని ఆందోళనకు దిగారు. తమకు చంద్రబాబు న్యాయం చేయాలంటూ బాధితుడు అక్కడ ధర్నాకు దిగారు. శ్రీనివాసరావుకు జనసేన మద్దదతు తెలిపింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపమని జనసేన నేతలు తెలిపారు.