Srisailam : నేడు శ్రీశైలంలో గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం

శ్రీశైలంలో నేడు చెంచు గిరిజనులకు ఉచితంగా దర్శన అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు

Update: 2025-12-30 02:29 GMT

శ్రీశైలంలో నేడు చెంచు గిరిజనులకు ఉచితంగా దర్శన అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు. సర్శదర్శనాన్ని ఉచితంగా గిరిజనులకు అందించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు నెలలో ఒకరోజు ఎంపిక చేసిన గిరిజనులకు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారి స్పర్శదర్శనానికి ఉచితంగా అనుమతిస్తారు.

నెలలో ఒకరోజు...
ప్రతినెలలో ఉచిత స్పర్శ దర్శనంలో భాగంగా నేడు చెంచుగిరిజనులకు ఆ అవకాశం కల్పించినట్లు పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు డొనేషన్ కౌంటర్ క్యూ లైన్ ద్వారా ఉచిత దర్శనానికి ఉచితంగా చెంచు గిరిజనులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే దర్శించుకునే గిరిజనులను ఐటీడీఏ సహకారంతో ఎంపిక చేస్తారు.


Tags:    

Similar News