వీక్ గా ఉన్న జిల్లాపై చంద్రబాబు నజర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు విజయనగరం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించునున్నారు.

Update: 2021-12-21 04:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు విజయనగరం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించునున్నారు. విజయనగరం జిల్లాలో గత ఎన్నికలలో టీడీపీ జీరో స్థానాలను సాధించింది. అక్కడ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. దీంతో చంద్రబాబు ఆ జిల్లా నేతలతో నేడు సమావేశం కానున్నారు.

నెలిమర్ల ఇన్ చార్జి పదవికి....
దీంతో పాటుజిల్లాలోని నెలిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జి ఎంపికను చంద్రబాబు చేయనున్నారు. ఇన్ ఛార్జి ఎంపిక కోసం నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోున్నారు. నెలిమర్ల నియోజకవర్గంలోని వివిధ మండల స్థాయి నేతలకు చంద్రబాబు సమావేశం కోసం ఆహ్వానం అందింది. ఈరోజు చంద్రబాబు ఇన్ ఛార్జిని ఫైనల్ చేసే అవకాశముంది.


Tags:    

Similar News