బెజవాడలో న్యూ ఇయర్ వేడుకల ఆంక్షలివే
నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు
నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. కొత్త ఏడాది వేడుకలు ఆహ్లాదకరంగా ఉండాలని కోరాు. అర్ధరాత్రి వేళ రోడ్లపై వేడుకలకు అనుమతి లేదుని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీెస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
తీవ్ర పరిణామాలు...
కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లపై రాకపోకలు నిషేధం ఉంటాయని విజయవాడ పోలీసులు తెలిపారు. ట్రిపుల్ రైడిoగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదని, ఈ నెల 31 రాత్రి విజయవాడలో ముమ్మర గస్తీ ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు.