సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరికాసేపట్లో సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరికాసేపట్లో సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు. ఆయన అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
ఉద్యోగుల ఆందోళన....
పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు పై కూడా చంద్రబాబు సీనియర్ నేతలో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.