నేడు చంద్రబాబు కీలక సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధండా ఉండేందుకు చంద్రబాబు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
రెండు రోజుల పాటు....
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన విధానాలపై కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించి దానిపై ఉద్యమించాలని నిర్ణయించనున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నారు.