నేడు నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలివే

నేడు రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమయ్యాయి.

Update: 2025-12-31 02:24 GMT

నేడు రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమయ్యాయి. డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో పోలీసులు వేడుకలపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లో నేడు మెట్రో రైళ్లు రాత్రి ఒంటి గంట వరకూ నడవనున్నాయి. ఈరోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో మాత్రమే కాకుండా మద్యం దుకాణాలను, బార్లు రాత్రి పన్నెండు గంటల వరకూ తెరిచి ఉంచేలా ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటి గంట వరకూ బార్లు, క్లబ్ లకు అనుమతి ఇచ్చింది.

ట్రాఫిక్ ఆంక్షలుంటాయ్...
ఈరోజు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి నో ఎంట్రీ ఇచ్చారు. అలాగే బేగంపేట్, టోలీచౌకీ మినహాయించి అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. విమాన టిక్కెట్ ఉంటేనే పీవీ ఎక్స్ ప్రెస్ వేపైకి అనుమతి ఇవ్వనున్నారు. నేటి రాత్రి పది గంటల నుంచి రెండు గంటల వరకూ హైదరాబాద్ లోకి ప్రయివేటు బస్సులకు నో ఎంట్రీ ఉంటుందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News