నేడు శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు
తిరుమలకు నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా చంద్రబాబు స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి తిరుపతికి చేరుకుని అమరావతి రాజథాని రైతులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.
రైతుల సభలో....
చంద్రబాబు నాయుడు తిరుపతి వస్తుండటతో పార్టీ నేతలు పెద్దయెత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఆయనకు విమానాశ్రయం నుంచి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నారు. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అక్కడి నేతలతో సమావేశం తర్వాత చంద్రబాబు తిరిగి బయలుదేరతారు.