రేపు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు తిరుపతిలో బహిరంగ సభలో ఆయన పొల్గొంటారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు తిరుపతిలో రైతులు జరిపే బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటించి రైతుల నుంచి భూమిని సేకరించారు. వారిని ఒప్పించి దాదాపు ముప్ఫయి వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది.
తిరుపతి సభకు....
దీంతో తొలి నుంచి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఆందోలన చేస్తున్న రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. పాదయాత్ర ప్రవేశించిన ప్రతి జిల్లాలో టీడీపీ శ్రేణులు సహకరించాయి. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. మహాపాదయాత్ర ముగిసింది. రైతులు కోర్టు నుంచి సభకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. విపక్షాలకు చెందిన నేతలు కూడా హాజరై రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు.