కోవిడ్ వచ్చినా.. బాబు సమీక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు

Update: 2022-01-20 02:23 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలోపార్టీ పరిస్థితి ఇప్పటి వరకూ చేపట్టిన కార్యక్రమాల వంటి వాటిని పరిశీలించనున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చే నివేదికను అనుసరించి చంద్రబాబు నేతల పనితీరును ఈ సమావేశాల్లో ప్రశ్నించే అవకాశముంది. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం కార్యక్రమాలు చేపట్టకుండా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఆన్ లైన్ లో....
చంద్రబాబుకు రెండు రోజుల క్రితం కోవిడ్ సోకింది. ఆయన ప్రస్తుతం ఉండవల్లిలోని తన నివాసంలో హోం ఐసొలేషన్ లో ఉంటున్నారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలు కుంటుపడకుండా చంద్రబాబు నియోజకవర్గాల వారీగా ఆన్ లైన్ లో సమీక్ష చేయనున్నారు.


Tags:    

Similar News