బాబు, లోకేష్ పర్యటనలపై నేడు క్లారిటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.

Update: 2022-01-05 04:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇక ఎక్కువ సమయం ప్రజల్లో గడపాలని నిర్ణయించారు. ఈరోజు లోక్ సభ, అసెంబ్లీ ఇన్ ఛార్జులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నేతలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సమాచారం తన వద్ద ఉందంటున్న చంద్రబాబు ఇందుకోసం పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు.

ఆందోళనలు....
చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇద్దరి పర్యటనల పై నేడు జరిగే సమావేశంలో క్లారిటీ రానుంది. ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై కూడా నేతల నుంచి చంద్రబాబు సూచనలను తీసుకోనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు ఆందోళనలను చేయాల్సిన తీరుపై కూడా చంద్రబాబు చర్చించనున్నారు.


Tags:    

Similar News