ఆ నేతకు చంద్రబాబు మూడు నెలల డెడ్ లైన్.. మారకపోతే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి శంకర్ యాదవ్ కు మూడు నెలల సమయం ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి శంకర్ యాదవ్ కు మూడు నెలల సమయం ఇచ్చారు. మూడు నెలల్లో పనితీరు మార్చుకోకపోతే ఇన్ ఛార్జి పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లె నియోజకవర్గంపై చంద్రబాబు నేడు సమీక్ష చేశారు. ఆ నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతానికి శంకర్ యాదవ్ నే ఇన్ ఛార్జిగా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు.
యాక్టివ్ కాకుంటే....
తంబళ్లపల్లె టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ గత కొన్నిరోజులుగా పార్టీని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఆయన ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్నారు. శంకర్ యాదవ్ పై కొందరు స్థానిక నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సమీక్ష తర్వాత లక్ష్మీదేవమ్మ కుటుంబంలో ఒకరికి ఇన్ ఛార్జి పదవి ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం మరోసారి శంకర్ యాదవ్ కే అవకాశమిచ్చారు. అందుకు మూడు నెలలు సమయం ఇచ్చారు. మూడు నెలల్లో ఇన్ ఛార్జిగా పార్టీని పరుగులు పెట్టించకపోతే వేరే ఇన్ ఛార్జి వస్తారని చంద్రబాబు నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.