రేపు పొలిట్ బ్యూరో సమావేశం.. కీలక నిర్ణయం?
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం రేపు జరగనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం రేపు జరగనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన సమావేశాలకు వచ్చే అవకాశం లేదు.
అసెంబ్లీ సమావేశాలకు...
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తాము కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని చెబుతున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగుల పీఆర్సీ వంటి అంశాలు చర్చకు వస్తున్న సందర్భంలో పార్టీ తరుపున వాయిస్ వినిపించాలని చంద్రబాబు కోరుతున్నారు. అనేక జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభ్యంతరాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా? అన్న దానిపై రేపు చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు.