నేడు చంద్రబాబు కీలక సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనుబంధ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనుబంధ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ అనుబంధ సంఘాలైన తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్టీయూసీ వంటి విభాగాల నేతలతో చంద్రబాబు సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ అనుబంధ సంఘాలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రెండు నియోజకవర్గాల్లో....
దీంతో పాటు చంద్రబాబు రెండు నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంతో పాటు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నేతలతో ఆయన సమావేశమవుతారు. ఇక్కడ ఇన్ ఛార్జుల నియామకంపై వారితో చర్చిస్తారు. వారి అభిప్రాయం మేరకే ఇన్ ఛార్జులను నియమిస్తారు.