ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు.. రెండేళ్లలో శాశ్వతంగా పోతాడు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పచ్చి మోసం చేశాడని ఫైర్ అయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పచ్చి మోసం చేశాడని ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడని, రెండేళ్లలో శాశ్వతంగా పోతాడని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పి జగన్ రెడ్డి అనునిత్యం మోసం చేస్తున్నారన్నారు. తెలుగురైతు ముగింపు సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ రైతులను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. తాము ఏపీలో తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ ను పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
అమరావతి ఉద్యమం....
అమరావతి ఉద్యమం చరిత్రలో మిగిలిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పేరు వింటనే పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పారు. అమరావతిని కాపాడుకునేందుకు మహిళలు ముందుండి పోరాడి విజయం సాధించారన్నారు. ఇది రైతుల విజయమని, పాదయాత్రలో మహిళలను ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానం చెప్పినట్లు నడుచుకోవాలని చంద్రబాబు కోరారు.