నేతలపై చంద్రబాబు ఆగ్రహం.. ఇలాగే ఉంటే?
పదవులు తీసుకుని యాక్టివ్ గా లేకపోతే చర్యలు తప్పవని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు
పదవులు తీసుకుని యాక్టివ్ గా లేకపోతే చర్యలు తప్పవని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితమయితే ఉపయోగం లేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ అనుబంధ సంఘాల విభాగాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాని చెప్పారు.
కాలక్షేపం చేయడానికి కాదు...
అనుబంధ సంఘాలు ఉన్నది కాలక్షేపం చేయడానికి కాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీ సిద్ధాంతాలను, స్టాండ్ ను ప్రజలకు తెలియజేయడానికేనని చెప్పారు. రానున్న కాలంలో ఎవరు పనిచేయడం లేదని తెలిసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ఎవరికి వారు సీరియస్ గా తీసుకుని వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చారు.