మళ్లీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారు

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-01-22 02:01 GMT

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. జీతాలు పెంచాలని అడిగితే తగ్గించిన ప్రభుత్వం దేశంలో ఇది ఒక్కటేనని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీపై జారీ చేసిన జీవోలను రద్దు చేసి పీఆర్సీ కొత్తగా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇది చీటింగ్ సర్కార్..
వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతల దోపిడీతో ప్రతి ఒక్కరి జీవితాన్ని నష్పపరుస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు. పోలీసులు, కేసులు కూడా దానిని ఆపలేవని, తమ కష్టాలు పోవాలంటే టీడీపీ మళ్లీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని టీడీపీ ఆపదని చంద్రబాబు స్పష్టం చేశారు.


Tags:    

Similar News