అబ్బో ఎన్టీఆర్ మీద ఎంత ప్రేమో?
ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని ప్రభుత్వం తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని ప్రభుత్వం తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పీఆర్సీ తో ఉద్యోగుల ఆందోళలను సైడ్ చేసేందుకు ఈ జిల్లాల అంశాన్ని హడావిడిగా తెచ్చినట్లు కనపడుతుందన్నాు. జనగణన పూర్తయ్యేంత వరకూ జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే జిల్లాల విభజన ఏకపక్షంగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన పేరును...
ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందని చెప్పుకొచ్చారు. అలాంటిది ఎన్టీఆర్ పేరు పెడితే ఎవరు వ్యతిరేకిస్తారన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరు పెడితే దానిని వైఎస్ తొలిగించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వైఎస్ పేరు కడప జిల్లాకు పెట్టినప్పుడు తాను వ్యతిరేకించలేదని చంద్రబాబుచెప్పారు. ఒకవైపు ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఎన్టీఆర్ పై తమకు ప్రేమ ఉందని చెబితే ప్రజలు ఎవరూ నమ్మరని చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటిన్లను కూడా నిలిపి వేసిన చరిత్ర జగన్ కు ఉందన్నారు.