సజ్జల వారిని బెదిరించింది నిజం కాదా?
ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంటాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలలో కోత విధించడం జగన్ చేసిన న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యోగుల పట్ల తెలుగుదేశం సానుకూలంగా స్పందించిందన్నారు.
తాకట్టు పెడుతూ....
తాము ఉద్యోగులకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతలేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వం భారతి సిమెంట్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుందని చంద్రాబు ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.