Tdp : రాజ్యాంగ హక్కులను జగన్ కాలరాస్తున్నారు

ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-02-24 12:35 GMT

ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సర్పంచ్‌ల హక్కులను జగన్ కాలరాస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంతో సర్పంచ్ లు పోరాడి గెలిచారని ఆయన అభినందించారు. సర్పంచ్ లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

అధికారాలను కత్తిరించి....
మైనింగ్, ఇసుక క్వారీలపై సర్పంచ్ లదే అధికారమని, అవి పంచాయతీ పరిధిలోనే ఉంటాయని చంద్రబాబు గుర్తు చేశారు. నరేగా నిధులను కూడా పంచాయతీలకు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు కోరారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన డబ్బును కేంద్రం తీసుకుంటే జగన్ అంగీకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. చెత్త పన్ను వసూలు చేయబోమని అన్ని పంచాయతీల్లో తీర్మానం చేసి పంపాలని చంద్రబాబు సర్పంచ్ లకు సూచించారు.


Tags:    

Similar News