నేడు నారావారాపల్లిలో చంద్రబాబు

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నేడు నారావారాపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు

Update: 2023-01-13 02:38 GMT

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నేడు నారావారాపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ సంబరాల్లో పాల్గొంటారు. ఆయన సొంత గ్రామమైన నారావారాపల్లికి మూడేళ్ల తర్వాత వస్తుండటంతో గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు.

గ్రామస్థులతో కలసి...
ఈరోజు మధ్యాహ్నం ఐదు వేల మందికి భోజనాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ప్రజలతో కలసి చంద్రబాబు విందులో పాల్గొననున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు తన సొంత గ్రామమైన నారావారిపల్లి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. నందమూరి బాలృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.


Tags:    

Similar News