Kodali Nani : కొడాలి నాని ఫిక్స్ అయినట్లుందిగా.. సవాల్ విసరడానికి అదే రీజనట

మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు

Update: 2026-03-04 06:58 GMT

మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు. ఏకంగా మంత్రి నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. ఒకరకంగా కొడాలి నాని తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నానని సంకేతాలు పంపినట్లు గుంటూరు పర్యటనలో తేలింది. 2024 ఎన్నికలకు ముందు వరకూ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఓటమిని ఆయన 2024 ఎన్నికల్లో జీర్ణించుకోలేకపోయారు. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గత రెండేళ్ల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. మరొకవైపు కొడాలి నాని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లడం మినహా గుడివాడలో మాత్రం ఉండి రాజకీయాలు మొదలు పెట్టలేదు.

పట్లు నిలుపుకునేందుకు...
కానీ గుడివాడ నియోజకవర్గంలో తిరిగి తన పట్టు నిలుపుకునేందుకు కొడాలి నాని తిరిగి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు గుంటూరుకు వచ్చిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇటీవల జగన్ పేరు రెడ్ బుక్ లో ఉందో లేదో త్వరలో తెలుస్తుందని ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలయ్య డైలాగుతో లోకేశ్ పై విమర్శలు చేశారు. రెడ్ బుక్ లో పేరున్నా అది లోకేశ్ కు మంచిది కాదని, లేకపోయినా తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిది కాదని కూడా చెప్పి తాను యాక్టివ్ అయ్యాయనని, ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు. ఇది తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో...
కొడాలి నాని గుడి వాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం పెద్దయెత్తున జరిగింది. రెడ్ బుక్ లో మొదట కొడాలి నాని పేరుందని కూడా అన్నారు. కొడాలి నాని విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని, అయితే ఇప్పుడు కొడాలి నాని ఏకంగా లోకేశ్ పై సవాల్ విసరడాన్ని టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొడాలని నానిని అలా వదిలేస్తారా? అని నిలదీస్తున్నారు. నాని మాత్రం తాను ఉంటే మహా అయితే వంద రోజులు జైల్లో ఉంటానని ఫిక్స్ అయినట్లే వ్యవహరించడంతో.. ఇక నాని గుడివాడలో రాజకీయం మొదలు పెట్టినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో గుడివాడ పాలిటిక్స్ హీట్ కానున్నాయి.


Tags:    

Similar News