Andhra Pradesh : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-03-04 05:48 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారంలో పదోతరగతి హాల్ టికెట్లు జారీ కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాల్ టికెట్లను ఈ వారం విడుదల చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కె.వి. శ్రీనివాసు లురెడ్డి వెల్లడించారు. మనమిత్ర వాట్సప్ లో డౌన్ లోడ్ కు అవకాశం కల్పించారు.

అధికారిక వెబ్ సైట్ ద్వారానే...
అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in, 'మన మిత్ర' వాట్సప్ నంబరు 9552300009, పాఠశాల విద్యాశాఖ లీప్ యాప్ నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు హాల్ టికెట్లు డౌన్ లో డ్ చేసుకోవాలని సూచించారు. లేదంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని తెలిపారు. పదో తరగతి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు పంపిణీకి, డౌన్ లోడ్ కు బోర్డు ఎలాంటి ప్రైవేట్ ఏజెన్సీకి, థర్డ్ పార్టీ వెబ్ సైట్లకు అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఇలాంటి వాటి ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చెయ్యవద్దని విద్యార్థులకు సూచించారు


Tags:    

Similar News