టమాటా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కనీసం పండించిన ధర కాదు కదా.. తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. దీంతో పండించిన టమాటాను కొందరు పొలాల్లోనే వదిలేస్తుండగా, మరికొందరు రోడ్డుపైన పారబోస్తున్నారు. గిట్టుబాటు ధర లేక పంటను పారపోస్తున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మార్కెట్‌లో టమాటా పంటను పారబోసిన రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
దేవరపల్లి మార్కెట్ లో...
దేవరపల్లి మార్కెట్‌ను దళారీలు, ప్రభుత్వం సర్వనాశనం చేశాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని టామాటా రైతులు అంటున్నారు. కనీసం మద్దతు ధర లభించకపోవడమే కాకుండా, పంటను కోసేందుకు ఖర్చు చేస్తున్న కూలీ కూడా రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమను ఆదుకోవాలని రైతులు టమాటాను రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు.