జగన్ ను కలిసిన మల్లు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు

Update: 2026-03-03 13:02 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు. ఈరోజు తాడేపల్లిలోని నివాసంలో జగన్ ను మల్లు భట్టి విక్రమార్క కలిశారు.జగన్ ను కలిసిన మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

వివాహ వేడుకకు రావాలని...
వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కాసేపు జగన్ తో ముచ్చటించారు. రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. కాగా తన ఇంటికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సాదరంగా ఆహ్వానించిన జగన్ ఆయనతో పలు విషయాలు మాట్లాడారు.


Tags:    

Similar News