Andhra Pradesh : సాహ్ని ఉన్నంతవరకూ ఎన్నికలు జరగవట

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు

Update: 2026-03-04 05:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2వతేదీతో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే ముందు, ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వం భావిస్తుంది.

నీలం సాహ్ని పదవీ కాలం...
కొన్ని నెలలపాటు ప్రత్యేక అధికారులతో పంచాయతీ పాలన కొనసాగించనున్నారు. ఈలోగా కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారులు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News