Chandrababu : నేడు పార్టీ ఆఫీసుకు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు.

Update: 2025-02-14 03:01 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. చంద్రబాబు కార్యాలయానికి వస్తుండటంతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. కార్యకర్తల నుంచి వినతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీకరించనున్నారు.

నేతలతో భేటీ...
అయితే చంద్రబాబు నాయుడు నేడు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవస్థాగత అంశాలపై చర్చించనున్నారు. వైసీపీ నేతల అరెస్ట్ తో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం అధికారులకు వాటిని పంపి పరిష్కరించాలని సూచించనున్నారు.


Tags:    

Similar News