బాబు కీలక కామెంట్స్ .. ఏపీలో ఎన్నికలు?

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. రేపో, ఎల్లుండో ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని అన్నారు

Update: 2022-03-08 12:34 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. రేపో, ఎల్లుండో ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని అన్నారు. మరికొంత కాలం ఆగితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని జగన్ భావించి ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతన్నారని చంద్రబాబు చెప్పారు. రోజురోజుకూ పతనావస్థకు వైసీపీ చేరుకుంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.

అదే చివరి ఛాన్స్ .....
ఒకసారి ఛాన్స్ అని అన్నావని, అదే చివరి సారి అని చంద్రబాబు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. జగన్ వయసు తన అనుభవమంత లేదన్నారు. జగన్ పక్కా బిజినెస్ మ్యాన్, క్రిమినల్ అని చంద్రబాబు అన్నారు. నెత్తిమీద కుంపటి వంటి వైసీపీని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డీ.. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్లు... మేము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News